hritik roshan: నా మాజీ ప్రియుడు అద్దె ఇంట్లో వుంటుంటే, నేను సొంతింట్లో వుంటున్నా!: హృతిక్‌ రోషన్‌పై కంగనా విసుర్లు

kangana on hritik roshan
  • ప్రేమలోపడ్డ అనంతరం లీగల్‌ కేసు నడిచింది
  • ఆ సమయంలో జరిగిన చర్చలు ఇప్పటికీ గుర్తున్నాయి
  • డబ్బుల కోసమే వెంటపడ్డానని హృతిక్‌ చెప్పుకున్నాడు
  • అది నిజం కాదని ఎలా నిరూపించుకోవాలో అర్థం కాలేదు
తన మాజీ ప్రియుడు, సినీ హీరో హృతిక్‌ రోషన్‌పై హీరోయిన్‌ కంగనా రనౌత్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించింది. తనను చూసి తాను గర్వ పడుతున్నానని చెప్పింది. తన మాజీ ప్రియుడు అద్దె ఇంట్లో జీవిస్తుంటే తాను మాత్రం సొంత ఇల్లు, కార్యాలయాన్ని కొన్నానని గర్వంగా చెప్పుకుంటున్నానని వ్యాఖ్యానించింది.

తాను సినీ జీవితం ప్రారంభించే సమయంలో తనకు ఎలాంటి లక్ష్యాలూ లేవని చెప్పింది. అయితే, తన మాజీ ప్రియుడితో ప్రేమలోపడ్డ అనంతరం లీగల్‌ కేసు కొనసాగిందని తెలిపింది. ఆ సమయంలో జరిగిన చర్చలు తనకు ఇప్పటికీ గుర్తున్నాయని తెలిపింది.

తాను చిన్న గ్రామానికి చెందిన అమ్మాయినని, తన మాజీ ప్రియుడి వెంట తాను డబ్బుల కోసమే పడ్డానని అందరూ చర్చించుకున్నారని, అసలు సమాజం అమ్మాయిల్ని అలాగే చూస్తోందని చెప్పింది. తనకు  డబ్బులపై ఆశలేదని, అయితే, తనను ఆస్తికోసం ప్రేమించే అమ్మాయిగానే అందరూ చూశారని చెప్పుకొచ్చింది.

తాను డబ్బుల కోసమే తన వెంటపడ్డానని హృతిక్‌ రోషన్‌ కూడా తన స్నేహితులకు చెప్పుకున్నాడని కంగనా రనౌత్ ఆరోపించింది. అది నిజం కాదని ఎలా నిరూపించుకోవాలో తనకు అర్థం కాలేదని చెప్పింది.
hritik roshan
kangana ranout
Bollywood

More Telugu News