Samantha: తమిళ చిత్రానికి పారితోషికం తగ్గించుకున్న సమంత

Samantha cuts her fee for Tamil film
షార్ట్స్‌లో చూడండి
స్టార్ హీరోయిన్లు తమ డిమాండును బట్టి నిర్మాతల నుంచి పారితోషికాన్ని లాగుతుంటారు. స్టార్ హీరోల సినిమాలైతే ఇక చెప్పేక్కర్లేదు. ఏమాత్రం తగ్గింపు వుండదు. మార్కెట్టును బట్టి ఇచ్చేయడమే. ఒక్కోసారి అర్జంటుగా డేట్స్ కావాలంటే మరింత కూడా ఎక్కువ అడుగుతుంటారు. అయితే, కొంతమంది హీరోయిన్లు మాత్రం అప్పుడప్పుడు తమకి కొన్ని కథలు నచ్చితే పారితోషికం విషయంలో అంతగా పట్టుపట్టరు. మంచి పాత్ర అనిపిస్తే తగ్గించుకుని మరీ చేస్తారు.

ఇప్పుడు సమంత కూడా అదే పనిచేస్తోంది. తన పాత్ర నచ్చడంతో తన మార్కెట్ రేటును బాగా తగ్గించుకుని సినిమా చేస్తోంది. అది తమిళ సినిమా కావడం ఓ విశేషమైతే, అందులో నయనతార కూడా నటించడం ఇంకో విశేషం కాగా, దానికి నయన్ ప్రియుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించడం మరో విశేషం. ఈ చిత్రంలోని పాత్ర సమంతకు బాగా నచ్చేసిందట. దానికి తోడు ఆ సినిమా బడ్జెట్టు కూడా తక్కువ. దాంతో నిర్మాతల రిక్వెస్ట్ పై సమంత తన ఫీజు తగ్గించుకుందని కోలీవుడ్ సమాచారం. ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలవుతుందని తెలుస్తోంది.    
Go Back to Shorts
Samantha
Nayanatara
Vighnesh
Kollywood

More Telugu News