దేశ రాజధానిలో పెట్రోల్, డీజిల్ ధరలు సమానం!
- ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 79.88
- ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 79.40
- వ్యాట్ పెంపుదలే కారణమంటున్న నిపుణులు
ఏ దేశంలోనైనా పెట్రోల్ తో పోలిస్తే, డీజిల్ ధర తక్కువగా ఉంటుంది. అయితే, ఢిల్లీలో డీజిల్ వాహనాల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో ప్రభుత్వం డీజిల్ పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను పెంచుకుంటూ వెళ్లింది. దీంతో రెండు ఇంధనాల ధరలు సమానమయ్యాయి. కాగా, ఇతర మెట్రో నగరాలైన హైదరాబాద్, కోల్ కతా, చెన్నై, ముంబై తదితర ప్రాంతాల్లో మాత్రం ఈ పరిస్థితి ఇంకా రాలేదు.