Telangana: మహిళ కడుపున బాలభీముడు.. 5.5 కిలోల బరువుతో జన్మించిన చిన్నారి!

Woman gave birth to five and half kg son
  • నిర్మల్ ప్రసూతి ఆసుపత్రిలో ఘటన
  • ఇంతటి బరువుతో పిల్లలు జన్మించడం అరుదు 
  • తల్లీబిడ్డలు క్షేమమన్న వైద్యులు
ఐదున్నర కేజీల బరువున్న శిశువుకు జన్మనిచ్చిన ఓ తల్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. పుట్టినప్పుడు శిశువులు సాధారణంగా రెండున్నర నుంచి మూడు కిలోల వరకు ఉంటారు. కానీ ఏకంగా 5.5 కేజీల బరువుతో జన్మించిన ఈ చిన్నారి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

తెలంగాణలోని నిర్మల్‌ ప్రసూతి ఆసుపత్రిలో జరిగిందీ ఘటన. సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడుకు చెందిన నేహ ఇటీవల పురుటి నొప్పులతో ఆసుపత్రిలో చేరింది. సాధారణ కాన్పుకు ఇబ్బంది పడుతుండడంతో వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేసి పండంటి బాబును బయటకు తీశారు. స్నేహకు 5.5 కిలోల బరువున్న బాబు జన్మించాడని వైద్యులు తెలిపారు. ఇంతటి బరువుతో శిశువులు జన్మించడం అరుదని పేర్కొన్నారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలిపారు.
Telangana
Nirmal District
Baby
Woman

More Telugu News