Google: కొత్త వ్యాపారం ప్రారంభించడం ఎలా?... గూగుల్ లో ట్రెండింగ్ ఇదే!

  • తాజా ట్రెండ్స్ విడుదల చేసిన గూగుల్
  • కరోనా కారణంగా ఉద్యోగాల్లో భారీ కోతలు
  • కొత్త మార్గాల్లో డబ్బు సంపాదించడంపై నెటిజన్ల ఆసక్తి
Google releases latest trends amidst corona pandemic

కరోనా వైరస్ ప్రపంచంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేసింది. ముఖ్యంగా, అనేకమందికి ఉపాధిని దూరం చేసింది. ఈ నేపథ్యంలో, యువత కొత్త మార్గాల్లో డబ్బు సంపాదించడం ఎలా? అన్నదానిపై గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసినట్టు తాజా ట్రెండింగ్స్ చెబుతున్నాయి.

ఈ క్రమంలో కొత్త వ్యాపారం ప్రారంభించడం ఎలా? అనే టాపిక్ గతవారం గూగుల్ ట్రెండింగ్స్ లో టాప్ లో ఉందట. లాండ్రీ సర్వీస్, నిత్యావసరాల డిస్ట్రిబ్యూషన్, ఫొటోలు తీయడం, పార్ట్ టైమ్ గా చిన్న వ్యాపారాలు చేయడం తదితర అంశాలను నెటిజన్లు బాగా శోధించారని గూగుల్ పేర్కొంది. తమ చుట్టుపక్కల జరుగుతున్న వ్యాపారాలపైనా ఆసక్తి చూపిస్తున్న నెటిజన్ల సంఖ్య కూడా అధికంగానే ఉన్నట్టు తెలిపింది. వరల్డ్ వైడ్ సెర్చ్ రిజల్ట్స్ ను విశ్లేషించి ఈ మేరకు గూగుల్ తాజా ట్రెండ్స్ ను విడుదల చేసింది.

More Telugu News