ఆ ముగ్గురు కలిసి ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారు: అంబటి రాంబాబు

23-06-2020 Tue 17:24
  • నిమ్మగడ్డ, సుజనా, కామినేని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారు
  • నిమ్మగడ్డ దుర్మార్గపు మనస్తత్వం ఈ భేటీతో బయటపడింది
  • వీరి భేటీకి చంద్రబాబే సూత్రధారి
These 3 people are plotting conspiracy against YSRCP govt says Ambati Rambabu

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్, బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ ల భేటీపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరు ముగ్గురు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వీరి భేటీకి టీడీపీ అధినేత చంద్రబాబే సూత్రధారి అని చెప్పారు. బీజేపీలో ఉన్నప్పటికీ సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ టీడీపీ కోసం పని చేస్తున్నారని అన్నారు.

వ్యవస్థల్లోకి సొంత మనుషులను చొప్పించడం, వ్యవస్థలను అనైతికంగా వాడుకోవడం చంద్రబాబుకు అలవాటేనని అంబటి విమర్శించారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో ఆయన ఎక్స్ పర్ట్ అని అన్నారు. నిమ్మగడ్డ దుర్మార్గపు మనస్తత్వం ఈ భేటీతో బయటపడిందని చెప్పారు. నిమ్మగడ్డ బండారాన్ని బయట పెట్టేందుకు ఎంత దూరమైనా వెళ్తామని అన్నారు. హోటల్ లో జరిగిన భేటీలో ఈ ముగ్గురూ కలిసి ఎవరితో మాట్లాడారో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ముగ్గురి భేటీపై చంద్రబాబు సమాధానం చెప్పాలని అన్నారు.