Pakistan: ఉగ్రవాదులను కాల్చి చంపిన పాకిస్థాన్ కౌంటర్ టెర్రరిజం బలగాలు

Pakistan forces kills 4 terrorists
  • ఖైబర్ ఫఖ్తుంక్వా ప్రావిన్స్ లో ఎదురు కాల్పులు
  • ఉగ్రవాదులు దాక్కున్న ప్రాంతంలో సోదాలు నిర్వహించిన బలగాలు
  • ఎదురు కాల్పుల్లో నలుగురు టెర్రరిస్టుల హతం
ఉగ్రవాదులను పెంచి పోషించే పాకిస్థాన్ ఎట్టకేలకు వారిపై దాడి చేసింది. పాక్ భద్రతాబలగాలు ఈరోజు నలుగురు ఉగ్రవాదులను కాల్చి చంపాయి. ఖైబర్ ఫఖ్తుంక్వా ప్రావిన్స్ లో చోటుచేసుకున్న ఎదురు కాల్పుల్లో నలుగురు టెర్రరిస్టులు హతమైనట్టు పాక్ కౌంటర్ టెర్రరిజం విభాగం అధికారి ఒకరు వెల్లడించారు.

'మత్తానీ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారం అందింది. దీంతో భద్రతాదళాలు ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించాయి. వారు దాక్కున్న ఇంట్లో సోదాలు చేయడానికి వెళ్లిన బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో కౌంటర్ టెర్రరిజం బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు' అని సదరు అధికారి తెలిపారు. వారినుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.
Pakistan
Terrorists
Encounter

More Telugu News