Etela Rajender: కరోనాను వ్యాపార కోణంలో చూడకండి: ప్రైవేట్ ల్యాబ్ లకు ఈటల సలహా

  • ప్రైవేట్ ల్యాబ్స్ ప్రతినిధులతో ఆరోగ్యమంత్రి ఈటల భేటీ 
  • పాజిటివ్ వ్యక్తుల వివరాలను పోర్టల్ లో అప్ లోడ్ చేయాలి
  • రిజల్ట్స్ వచ్చేంత వరకు పేషెంట్ ను ఐసొలేషన్ లో ఉంచాలి
Dont see corona in commercial angle says Etela

తెలంగాణలో కరోనా టెస్టులు చేసేందుకు ప్రైవేట్ ల్యాబ్ లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ల్యాబ్స్ ప్రతినిధులతో ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ ఈ రోజు హైదరాబాదులో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాను వ్యాపార కోణంలో చూడవద్దని, మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నం చేయవద్దని సూచించారు.

కరోనా చికిత్సలో సర్వైలెన్స్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ అనే మూడు విధానాలు కలిసి ఉన్నాయని... ఈ నేపథ్యంలో పాజిటివ్ గా తేలిన ప్రతి వ్యక్తి వివరాలను పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. ఇంటికే వచ్చి పరీక్షలను నిర్వహిస్తామంటూ మార్కెటింగ్ చేయవద్దని చెప్పారు.

కరోనా పరీక్షలకు, సాధారణ పరీక్షలకు చాలా తేడా ఉందని మంత్రి చెప్పారు. కరోనా కేసులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆరోగ్యశాఖకు అందించాలని తెలిపారు. శాంపిల్స్ తీసుకున్న వారి రిజల్ట్స్ వచ్చేంత వరకు వారిని ఐసొలేషన్ లోనే ఉంచాలని అన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లకు పూర్తి స్థాయిలో పీపీఈ  కిట్స్ ఇవ్వాలని చెప్పారు. లేకపోతే వారికి కూడా కరోనా సోకే ప్రమాదం ఉంటుందని అన్నారు.

More Telugu News