Puri: సుప్రీం మార్గదర్శకాల మధ్య ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర

  • పూరీ క్షేత్రంలో కదిలిన జగన్నాథుడి రథచక్రాలు
  • భక్తులను అనుమతించని సుప్రీంకోర్టు
  • ఒక్కో రథాన్ని లాగేందుకు 500 మందికి మాత్రమే అనుమతి
Puri Jagannath Ratha Yatra begins in Puri

దేశంలో అతిపెద్ద వేడుకగా భావించే పూరీ జగన్నాథ రథయాత్ర ఎట్టకేలకు ప్రారంభమైంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అసలు ప్రారంభమవుతుందా? లేదా? అనే సందేహాల నడుమ సుప్రీంకోర్టు ఊరట కలిగించేలా ఆదేశాలు ఇవ్వడంతో జగన్నాథుడి రథచక్రాలు ముందుకు కదిలాయి.

సాధారణంగా ప్రతి ఏడాది లక్షల మంది హాజరయ్యే ఈ మహాయాత్రలో ఈసారి కరోనా ప్రభావం స్పష్టంగా కనిపించింది. భక్తులు పాల్గొనరాదని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, పూజారులు, ఆలయ సిబ్బంది మాత్రమే యాత్రలో పాల్గొంటున్నారు. ఈ యాత్రలో పాల్గొనే మూడు రథాలను లాగేందుకు ఒక్కొక్కదానికి 500 మందిని మాత్రమే అనుమతిస్తూ సుప్రీం నిర్ణయించడంతో ఆ మేరకు మాత్రమే రథాలను లాగుతున్నారు. కాగా, ఈ కార్యక్రమాన్ని టీవీ లైవ్ లో ప్రసారం చేయాలని సుప్రీం తన ఆదేశాల్లో పేర్కొంది.

More Telugu News