Nara Lokesh: బాలకృష్ణ పవర్‌ఫుల్ సినిమా డైలాగుతో వైసీపీ నేతలపై నారా లోకేశ్ వ్యాఖ్యలు

  • వైకాపా మాఫియా ఇసుక కొట్టేస్తే నో సీఐడీ
  • ఇళ్ల స్థలాలు అమ్మతుంటే నో సీఐడీ
  • ఇళ్ల స్థలాల కొనుగోలు పేరుతో కోట్లు కొల్లగొడుతుంటే నో సీఐడీ
  • జే ట్యాక్స్ వసూలు చేస్తుంటే నో సీఐడీ
lokesh fires on ycp leaders

నందమూరి బాలకృష్ణ 'సింహా' సినిమాలో చెప్పిన ఓ డైలాగును అనుకరిస్తూ టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 'పేదలకు అన్యాయం జరుగుతుంటే నో పోలీస్.. ఓ క్రిమినల్‌ని చంపితే మాత్రం పోలీసులు వస్తున్నారు' అంటూ బాలకృష్ణ ఆ సినిమాలో డైలాగులు చెబుతారు. ఆ డైలాగులను అనుకరిస్తూ.. వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతుంటే కనపడని సీఐడీ.. టీడీపీ నేతలపై మాత్రం అక్రమ కేసులు పెడుతోందని లోకేశ్ ట్వీట్‌ చేశారు.

'వైకాపా మాఫియా ఇసుక కొట్టేస్తే నో సీఐడీ, ఇళ్ల స్థలాలు అమ్మతుంటే నో సీఐడీ, ఇళ్ల స్థలాల కొనుగోలు పేరుతో కోట్లు కొల్లగొడుతుంటే నో సీఐడీ, విషం కంటే ప్రమాదకరమైన మందు పోస్తూ వేల కోట్లు జే ట్యాక్స్ వసూలు చేస్తుంటే నో సీఐడీ. 108లో స్కామ్ బయటపడితే నో సీఐడీ, మైన్స్ మింగేస్తుంటే నో సీఐడీ' అని ట్వీట్ చేశారు.
 
'మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు పాల్పడుతుంటే నో సీఐడీ. రాజారెడ్డి రాజ్యాంగంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ని సోషల్ మీడియా వేధింపుల డిపార్ట్మెంట్ గా మార్చేశారు వైఎస్ జగన్ గారు. భావ ప్రకటనా స్వేచ్ఛని హరించే హక్కు మీకు ఎవరిచ్చారు?' అని అన్నారు.

'ఏం నేరం చేశారని అర్థరాత్రి చొరబడి మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు? కృష్ణ, కిశోర్ గారికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. జగన్ గారి చెత్త పాలన గురించి వైకాపా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలే మీడియా ముఖంగా వివరిస్తున్నారు మరి వారిని కూడా సీఐడీ అరెస్ట్ చేస్తుందా?' అని ప్రశ్నించారు.

More Telugu News