Lover: రాత్రివేళ ప్రేయసి కోసం వెళితే... కట్టేసి కొట్టిన గ్రామస్థులు!

attack on lover in tamilnadu
  • ప్రియురాలి కోసం యువకుని సాహసం
  • ప్రేయసి కోసం వేచి చూస్తుంటే చూసిన గ్రామస్థులు
  • ఆసుపత్రిలో ప్రియుడు, అతని స్నేహితుడు
తాను ప్రేమించిన ప్రియురాలి కోసం సాహసం చేసిన ఓ యువకుడు, గ్రామస్థుల చేతికి చిక్కి చావు దెబ్బలు తిన్న ఘటన తమిళనాడులోని తంజావూర్ జిల్లా వడక్కి కోటలో జరిగింది. వివరాల్లోకి వెళితే, తెన్నమనాడు ప్రాంతానికి చెందిన ప్రవీణ్ (20) అనే యువకుడు వడక్కికోట గ్రామానికి చెందిన యువతి ప్రేమలో పడ్డాడు.

ఇటీవల ఆమె పిలవడంతో, తన స్నేహితునితో కలిసి గ్రామానికి వెళ్లాడు. రాత్రి ఒంటిగంట సమయంలో వారిద్దరూ సమయం కోసం వేచి చూస్తున్న వేళ, కొందరు గ్రామస్థుల కళ్లలో పడ్డారు. వీరిని దొంగలుగా  భావించిన గ్రామస్థులు, వారిపై దాడికి దిగి, చెట్టుకు కట్టేసి, చితకబాదారు. దీంతో వారిద్దరూ స్పృహతప్పి పడిపోయారు. ఆ తరువాత పోలీసులకు సమాచారం అందించారు.

సదరు యువతి పిలిచిన తరువాతనే వారిద్దరూ వచ్చారని, ఆమె కోసం ఇంటికి సమీపంలో వేచి చూస్తున్న వేళ, గ్రామస్థుల కంట బడ్డారని, వారేమీ దొంగలు కాదని తేల్చిన పోలీసులు, పలువురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గ్రామస్థులు దాడి చేసిన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. వడక్కి కోటలో ఈ ఘటన కలకలం రేపింది.
Lover
Tamilnadu
People

More Telugu News