Airtel: 100 మందికిపైగా యువతుల వాట్సాప్ ఖాతాల హ్యాక్... నిందితుల్లో ఎయిర్ టెల్ ప్రమోటర్!

  • హర్యానాలో ఘటన
  • డబ్బివ్వకుంటే వ్యక్తిగత వివరాలు బహిర్గతం చేస్తామని బెదిరింపులు
  • ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
Above 100 Ladies Whats app Accounts Hacked

సోషల్ మీడియా ఖాతాలను విరివిగా వాడే వారు, ముఖ్యంగా యువతులు ఎటువంటి చిక్కుల్లో పడతారనడానికి ఇది ఓ తాజా నిదర్శనం. హర్యానాకు చెందిన ముగ్గురు వ్యక్తులు, ఓ ముఠాగా ఏర్పడి, 100 మందికి పైగా అమ్మాయిల వాట్సాప్ ఖాతాలను హ్యాక్ చేసి వారి నుంచి డబ్బు డిమాండ్ చేశారు.

ఓ యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు వివరాలు వెల్లడించారు. నిందితుల్లో ఎయిర్ టెల్ సంస్థ ప్రమోటర్ ఒకరు ఉండటం గమనార్హం. అతను మిగతా ఇద్దరికీ, నకిలీ ఐడీ కార్డులతో సిమ్ లను మంజూరు చేశాడు. ఆపై యువతుల వాట్సాప్ ఖాతాలను హ్యాక్ చేసిన వీరు, వారికి కాల్స్ చేసి, తాము అడిగిన డబ్బు ఇవ్వకుంటే, వారి వ్యక్తిగత వివరాలు, చిత్రాలను ఆన్ లైన్లో పెడతామని బెదిరింపులకు దిగారు. ఒక్కొక్కరి నుంచి వీరు రూ. 10 వేల వరకూ వసూలు చేశారు. వీరి బాధితుల్లో మరింత మంది ఉండివుండవచ్చని, కేసును విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

More Telugu News