Chingari: గాల్వన్ లోయ ఘర్షణలతో ఈ దేశీయ యాప్ కు విశేష ఆదరణ!

New app Chingari come to limelight after Galwan Valley clashes
  • భారత్ లో చైనా వస్తువుల వ్యతిరేక ఉద్యమం
  • టిక్ టాక్ కు ప్రత్యామ్నాయంగా చింగారీ యాప్
  • 72 గంటల వ్యవధిలో 5 లక్షల డౌన్ లోడ్లు
ఇటీవల చైనా బలగాలతో భారత సైనికులు గాల్వన్ లోయలో వీరోచిత పోరాటం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు చనిపోవడంతో దేశవ్యాప్తంగా చైనాపై వ్యతిరేకత తీవ్రమైంది. చైనా వస్తు బహిష్కరణ ఓ ఉద్యమంలా రాజుకుంటోంది. ముఖ్యంగా, టిక్ టాక్ వంటి చైనా యాప్ లపైనా వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, చింగారీ అనే దేశీయ యాప్ కు విపరీతమైన ఆదరణ లభిస్తోందని ఆ యాప్ సృష్టికర్తలు చెబుతున్నారు.

జూన్ 10 నాటికి లక్ష డౌన్ లోడ్లు సాధించిన ఈ యాప్... గాల్వన్ లోయ ఘర్షణల తర్వాత కేవలం మూడ్రోజుల వ్యవధిలో 5 లక్షల డౌన్ లోడ్లు సాధించిందని యాప్ రూపకర్తలు సిద్ధార్థ్, బిశ్వాత్మ తెలిపారు. టిక్ టాక్ కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న ఈ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో ట్రెండింగ్ లో ఉందని వెల్లడించారు. చింగారీ యాప్ లో వ్యూస్ ఆధారంగా వీడియోలపై యూజర్లు డబ్బు సంపాదించుకోవచ్చని సిద్ధార్థ్, బిశ్వాత్మ చెబుతున్నారు.
Chingari
App
Galwan Valley
TikTok
China
India

More Telugu News