Santhosh Kumar: ఏ ఉద్యోగం కావాలో కేసీఆర్ కోరుకోమన్నారు.. భోజనానికి ఆహ్వానించారు: సంతోషి

KCR invited us for lunch says Col Santhosh Babu wife Santhoshi
  • కేసీఆర్ మాలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు
  • కోరిన డిపార్ట్ మెంటులో గ్రూప్ వన్ ఉద్యోగాన్ని ఇస్తామని చెప్పారు
  • మాకు కొండంత ధైర్యం వచ్చింది
ముఖ్యమంత్రి కేసీఆర్ కష్ట కాలంలో తమకు అండగా నిలిచారని భారత్-చైనా సరిహద్దుల్లో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషి అన్నారు. తమలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారని తెలిపారు. సంతోష్ ని వెనక్కి తీసుకురాలేనని...  కానీ, సంతోష్ లేని లోటును మాత్రం తీరుస్తానని చెప్పారని అన్నారు.

కోరిన డిపార్ట్ మెంటులో గ్రూప్ వన్ ఉద్యోగాన్ని ఇస్తానని చెప్పారని తెలిపారు. తమ కుటుంబాన్ని భోజనానికి ఆహ్వానించారని చెప్పారు. తమ పిల్లలతో ముఖ్యమంత్రి కాసేపు గడపారని... దీంతో తమకు కొండంత ధైర్యం వచ్చిందని తెలిపారు. బంజారాహిల్స్ లో ఇంటిని నిర్మించుకునేందుకు స్థలాన్ని ఇచ్చారని చెప్పారు. రూ. 5 కోట్ల ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్ ను అందించారని తెలిపారు.
Santhosh Kumar
Wife
KCR
TRS

More Telugu News