Allu Arjun: 'పుష్ప' సినిమాకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటున్న అల్లు అర్జున్?

Allu Arjun is demanding high remuneration for Pushpa movie
  • రూ. 35 కోట్లు, లాభాల్లో వాటా తీసుకోబోతున్నాడంటూ వార్త
  • కరోనా నేపథ్యంలో బడ్జెట్ పై ఆలోచిస్తున్న నిర్మాతలు
  • రెమ్యునరేషన్ పై బన్నీ పునరాలోచించుకునే అవకాశం
'అల వైకుంఠపురములో' సినిమాతో అల్లు అర్జున్ భారీ హిట్ అందుకున్నాడు. తాజాగా 'పుష్ప' సినిమాతో బన్నీ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాకు బన్నీ రెమ్యునరేషన్ ను భారీగా పెంచాడని తెలుస్తోంది. రూ. 35 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటాను కూడా బన్నీ తీసుకోబోతున్నాడని చెపుతున్నారు.

'అల వైకుంఠపురములో' చిత్రానికి బన్నీ రూ. 25 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు పాతిక శాతం వాటా ను తీసుకున్నాడనే టాక్ ఉంది. అయితే 'పుష్ఫ' సినిమాపై కరోనా ఎఫెక్ట్ ఉండటంతో బడ్జెట్ పై నిర్మాతలు కొంత ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, రెమ్యునరేషన్ విషయంలో బన్నీ కొంత ఆలోచించుకునే అవకాశం కూడా ఉందని చెపుతున్నారు.
Allu Arjun
Pushpa Movie
Remuneration

More Telugu News