Keerthy Suresh: తమిళ హీరో విజయ్ పుట్టినరోజు సందర్భంగా వయొలిన్ ట్రీట్ ఇచ్చిన కీర్తి సురేశ్

Keerthi Suresh plays violin as a tribute for Hero Vijay birthday
  • ఇవాళ విజయ్ పుట్టినరోజు
  • విజయ్ కి శుభాకాంక్షల వెల్లువ
  • జీవితం చాలా చిన్నది మిత్రమా అంటూ కీర్తి విషెస్
ఇవాళ తమిళ స్టార్ హీరో విజయ్ జన్మదినం. దాంతో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అందరిలోనూ హీరోయిన్ కీర్తి సురేశ్ విషెస్ తెలిపిన విధానం ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి. కీర్తి సురేశ్ ఓ సంగీత విద్యాంసురాలి తరహాలో వయొలిన్ వాయించి విజయ్ కి శుభాకాంక్షలు తెలిపింది. ఈ ప్రయత్నంలో కీర్తి ఓ ప్రొఫెషనల్ సంగీతకారిణిలా వాయించడం విశేషంగా పేర్కొనాలి. ఈ వీడియోను ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేసింది. "జీవితం చాలా చిన్నది మిత్రమా! అందుకే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. హ్యాపీ బర్త్ డే విజయ్ సర్, మీ పుట్టినరోజు సందర్భంగా ఓ చిన్ని కానుక" అంటూ ట్వీట్ చేసింది.

Keerthy Suresh
Vijay
Tamil Hero
Birthday
Violin
Tribute

More Telugu News