Buddha Venkanna: పబ్జీ ఆటకు పోతురాజు... పనికి తిమ్మరాజు అంటూ సొంత ఎంపీయే జగన్ ను విమర్శిస్తున్నారు: బుద్ధా

Buddha Venkanna take a jibe at CM Jagan and Vijayasai Reddy
  • సీఎం జగన్ పై బుద్ధా విమర్శలు
  • జాకీలేసి లేపినా తాడేపల్లి గడపదాటి రారంటూ ఎద్దేవా
  • రేనా చూడు రేనా చూడు అంటూ ట్విట్టర్ లో వ్యంగ్యం
టీడీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి బుద్ధా వెంకన్న వైసీపీ అధినాయకత్వంపై మరోసారి వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబును అనుకూల మీడియా కింద జాకీలతో, పైన క్రేన్లతో లేపుతోందంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పబ్జీ ఆటకు పోతురాజు, పనిచేయడానికి తిమ్మరాజు అని సొంత ఎంపీనే సీఎం జగన్ ను విమర్శిస్తున్నారంటూ బుద్ధా ట్వీట్ చేశారు. "మీరేమో ట్వీట్లతో జాకీలేస్తూ, లేపి ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటారు... కానీ ఆయన తాడేపల్లి గడపదాటి రారు" అంటూ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఓ తెలుగు సినిమాలోని ప్యారడీ సాంగ్ ను కూడా బుద్ధా ట్వీట్ చేశారు. 'రేనా చూడు రేనా చూడు 'అంటూ సాగే ఆ పాటను విజయసాయిరెడ్డికి సంధించారు.

Buddha Venkanna
Jagan
Vijay Sai Reddy
Telugudesam
YSRCP

More Telugu News