Nabha Natesh: జూనియర్ ఎన్టీఆర్ సరసన బంపర్ ఆఫర్ కొట్టేసిన నభా

Nabha Natesh gets a chance in Junior NTR movie
  • 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంలో మెరిసిన నభా నటేశ్
  • ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కాంబినేషన్లో రానున్న కొత్త చిత్రం
  • ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నభా
పూరీ జగన్నాథ్ చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'లో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నభా నటేశ్ బంపర్ ఆఫర్ కొట్టేసింది. ప్రస్తుతం 'సోలో బ్రతుకే సో బెటరు', 'అల్లుడు అదుర్స్' అనే చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తో నటించే అద్భుత అవకాశం ఆమె తలుపు తట్టినట్టు తెలుస్తోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో కొత్త చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కోసం నభాను ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో తెలంగాణ అమ్మాయి పాత్రను నభా పోషించబోతోందట. మరోవైపు ఈ చిత్రానికి 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
Nabha Natesh
Junior NTR
Tollywood
Trivikram Srinivas

More Telugu News