Rahul Gandhi: రాహుల్ రెండు పదాల విమర్శ... 'సరెండర్ మోదీ' ఇప్పుడు ట్విట్టర్ లో నంబర్ వన్ ట్రెండ్!

Rahul Comment Surender Modi is Twitters Number one Trend
  • నిత్యమూ మోదీపై రాహుల్ విమర్శలు
  • శనివారం నాడు 'సరెండర్ మోదీ' ట్వీట్
  • గంటల వ్యవధిలో ట్రెండింగ్
గత కొంతకాలంగా నిత్యమూ ప్రధాని నరేంద్ర మోదీని, యూపీఏ ప్రభుత్వాన్ని తన సామాజిక మాధ్యమాల ద్వారా విమర్శిస్తున్న రాహుల్ గాంధీ, ఆదివారం నాడు 'సరెండర్ మోదీ' అన్న పదం వాడుతూ విమర్శించగా, అది సాయంత్రానికి హ్యాష్ ట్యాగ్ గా మారి ట్విట్టర్ లో నంబర్ వన్ ట్రెండింగ్ పదం అయింది.

 దీనిపై లక్షలాది మంది స్పందించారు. పలువురు రాహుల్ గాంధీ ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తుండగా, మరికొందరు రాహుల్ 'సరెండర్' అన్న పదాన్ని తప్పుగా స్పెల్ చేశారని పేర్కొంటూ సెటైర్లు వేశారు. మరికొందరు రాహుల్ పదాలతో ఆడుతున్నారని, కొత్త పదాలు కనిపెడుతున్నారని కామెంట్లు పెట్టారు. భారత భూభాగాన్ని చైనాకు మోదీ సరెండర్ చేశారంటూ రాహుల్ విమర్శించిన సంగతి తెలిసిందే. దీనికి ఆయన జపాన్ టైమ్స్ పత్రిక రాసిన ఓ కథనాన్ని కూడా జోడించారు.
Rahul Gandhi
Sarender Modi
Twitter
Trending

More Telugu News