sakhi agarwal: ఇకపై చైనా ఉత్పత్తుల ప్రకటనల్లో నటించేది లేదు: నటి సాక్షి అగర్వాల్

Actress Sakshi Agarwal says she will boycott china products
  • చైనా తీరుపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు
  • చైనా వస్తువులు వాడొద్దంటూ ప్రచారం
  • మన దేశం శాంతి, సహనానికి చిరునామా అన్న సాక్షి
గాల్వన్ ఘటన నేపథ్యంలో చైనా తీరుపై దేశంలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ నటి సాక్షి అగర్వాల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై చైనా దేశ ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనల్లో నటించబోనని తెగేసి చెప్పి దేశంపై తనకున్న ప్రేమను చాటుకుంది. అంతేకాదు, చైనా ఉత్పత్తులను కూడా వినియోగించబోనని స్పష్టం చేసింది.

మన సరిహద్దు ప్రాంతాలను చైనా ఆక్రమించుకోవాలని చూస్తోందన్న నటి.. శాంతికి, సహనానికి భారతదేశం చిరునామా అని పేర్కొంది. మన భూభాగాన్ని ఆక్రమించుకునేందుకే మన సైన్యంపై దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా తీరుకు నిరసనగా ఆ దేశ ఉత్పత్తులను వినియోగించకపోవడమే కాకుండా, ఆ దేశ ఉత్పత్తుల ప్రకటనల్లోనూ నటించబోనని స్పష్టం చేసింది.
sakhi agarwal
China
Bollywood

More Telugu News