New Delhi: ఫలించిన ప్లాస్మా థెరపీ... కోలుకున్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ 

  • ఢిల్లీ లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స
  • శరీరంలో పెరిగిన యాంటీ బాడీలు
  • ఆయన్ను జనరల్ వార్డుకు తరలిస్తామన్న వైద్యులు
Plasma Theraphy for Satyender Jain Success

కరోనా వైరస్ బారిన పడిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్యం మెరుగు పడింది. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనకు చికిత్స జరుగుతోంది. మూడు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం విషమించగా ప్లాస్మా థెరపీని చేయాలని అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్న ఓ వ్యక్తి నుంచి సేకరించిన ప్లాస్మాను సత్యేంద్ర జైన్ శరీరంలోకి వైద్యులు ఎక్కించారు.

ఈ చికిత్స సత్ఫలితాలను ఇచ్చింది. ఆయనలో పెరిగిన యాంటీ బాడీలు వైరస్ ను నిరోధించాయి. ప్రస్తుతం జైన్ చికిత్సకు స్పందిస్తున్నారని, మరో 24 గంటల పాటు జ్వరం, శ్వాస ఇబ్బందులు తలెత్తకుంటే, ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలిస్తామని వైద్య బృందాలు వెల్లడించాయి. తొలుత రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో చేరిన ఆయనను, ఆపై మ్యాక్స్ హాస్పిటల్ కు తరలించారు. 

More Telugu News