పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే కుటుంబంలో ఏడుగురికి కరోనా
- పోడూరు మండలంలో ఘటన
- అందర్నీ ఆసుపత్రికి తరలించిన అధికారులు
- మండలంలో 38 మందికి కరోనా
కాగా, ఇదే కాలనీలో మరొకరికి కూడా వైరస్ సోకింది. ఫలితంగా గ్రామంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 8 మందికి చేరింది. బాధితుల్లో ఆరుగురు మహిళలు కాగా, ఇద్దరు పురుషులు ఉన్నారు. బాధితుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. మరోపక్క, ఇప్పటి వరకు మండలంలో 38 మంది కరోనా బారినపడగా, పోడూరులో ఐదు కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు.