West Godavari District: ఆత్మహత్య చేసుకునేందుకు రైల్వే ట్రాక్‌పై నిలబడి సెల్ఫీ ఫోటో.. తల్లిదండ్రులకు పంపిన యువకుడు

youngster sent selfie to parents
  • పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో ఘటన
  • తల్లిదండ్రులతో గొడవ పడి వెళ్లిన యువకుడు
  • ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం
  • కాపాడిన పోలీసులు
రైల్వే ట్రాక్‌పై నిలబడి సెల్ఫీ ఫోటో తీసుకుని తన తల్లిదండ్రులకు పంపి కంగారు పెట్టించాడు ఓ యువకుడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. గన్‌బజార్‌కు చెందిన లీలావర ప్రసాద్ అనే యువకుడు తన తల్లిదండ్రులతో గొడవ పడి, వారి మీద కోపంతో వెళ్లిపోయాడు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుని, రైల్వే ట్రాక్‌పై నిలబడి సెల్ఫీ ఫోటో తీసుకుని వారికి పంపాడు.

దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఈ సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని రైల్వే ట్రాక్‌పై ఉన్న లీలావర ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి, తల్లిదండ్రులకు అప్పగించారు.
West Godavari District
Crime News

More Telugu News