Viral Pics: ఆకాశంలో అరుదైన దృశ్యం.. సూర్యుడి కేంద్ర భాగం కనపడకుండా అడ్డుగా జాబిల్లి.. ఫొటోలు ఇవిగో

  • ఏర్పడిన రాహుగ్రస్త్య సూర్యగ్రహణం  
  • ఈ రోజు ఉదయం 9.16 గంటల నుంచి సూర్యగ్రహణం
  • మధ్యాహ్నం 3.04 గంటల వరకు కొనసాగింపు
  • పూర్తిస్థాయిలో వలయాకార సూర్య గ్రహణం  
SolarEclipse 2020 see  in pics

ఆకాశంలో అరుదైన సుందర దృశ్యం కనువిందు చేస్తోంది. రాహుగ్రస్త్య సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ రోజు ఉదయం 9.16 గంటల నుంచి ప్రారంభమైన సూర్య గ్రహణం మధ్యాహ్నం 3.04 గంటల వరకు ఉంటుంది.

కాగా, ఉదయం 10.14 గంటలకు ఆకాశంలో సుందరదృశ్యం కనపడి అందరినీ ఆకర్షితులను చేసింది. పూర్తిస్థాయిలో వలయాకార సూర్య గ్రహణం ఏర్పడడం గమనార్హం. సూర్యుడి కేంద్ర భాగం కనపడకుండా అడ్డుగా జాబిల్లి వచ్చింది.

తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుంచి మధ్యాహ్నం 1.44 గంటల వరకు 51 శాతం సూర్యుడు కనిపిస్తాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10.21 నుంచి మధ్యాహ్నం 1.49 వరకు 46 శాతం కనిపిస్తాడు.

దేశ, విదేశాల్లో కనపడిన సూర్య గ్రహ దృశ్యాలు..
    

           
     
     

More Telugu News