Chiranjeevi: తమ తండ్రుల గురించి చిరంజీవి, మహేశ్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. చిన్నప్పటి ఫొటోలు పోస్ట్

mahesh babu chiranjeevi about fathersday
  • ఫాదర్స్‌ డే సందర్బంగా పోస్ట్
  • తన తండ్రి, కుమారుడి ఫొటో పోస్ట్ చేసిన చిరు
  • 'చిరు'తతో చార్మింగ్‌ డ్యాడ్ అని వ్యాఖ్య
ఫాదర్స్‌ డే సందర్బంగా సినీ నటులు చిరంజీవి, మహేశ్ బాబు తమ తండ్రుల ఫొటోలు పోస్ట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. 'చిరుతతో చార్మింగ్‌ డ్యాడ్‌.. మా నాన్న నవ్వు ... నా బిడ్డ చిరునవ్వు... రెండూ నాకు చాలా ఇష్టం. హ్యపీఫాదర్స్ డే' అని చిరంజీవి చెప్పారు.  
                  
'దృఢమైన, దయ, ప్రేమ, సున్నిత, చాలా శ్రద్ధ తీసుకునే తండ్రి.. నాకు, నా తండ్రి మధ్య ఉన్న అనుబంధాన్ని చెప్పడానికి ఇవి కొన్ని పదాలు. ఆయన వల్లే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను. ఆయన నాకు నేర్పిందే నేను నా పిల్లలకు నేర్పుతున్నాను. హ్యాపీ ఫాదర్స్‌ డే నాన్న' అని మహేశ్ బాబు పేర్కొన్నాడు. చిన్నప్పుడు తన తండ్రితో దిగిన ఫొటోలను ఆయన ఈ సందర్భంగా పోస్ట్ చేశారు.
Chiranjeevi
Mahesh Babu
Tollywood

More Telugu News