India: నెట్ వర్క్ 18 పోల్... చైనా వస్తువులు వద్దంటున్న అత్యధిక భారతీయులు!

70 Persent Respondents ready to Boycot China Products in A Poll
  • చైనా ప్రొడక్టులు వాడకుండా ఉండేందుకు సిద్ధమన్న 70 శాతం మంది
  • సెలబ్రిటీలు చైనా ఉత్పత్తులకు దూరం కావాలన్న 97 శాతం మంది
  • పాకిస్థాన్ కన్నా చైనా నుంచే ఇండియాకు పెను ముప్పన్న 92 శాతం మంది

ఇండియా, చైనాల మధ్య సరిహద్దుల్లో వివాదాలు తలెత్తడం, భారత సైనికులను చైనా జవాన్లు చంపేసిన నేపథ్యంలో, చైనా వస్తువులను బాయ్ కాట్ చేయాలని అత్యధిక భారతీయులు కోరుకుంటున్నారు. చైనా వస్తువులపై నిషేధం విధించే విషయంలో నెట్ వర్క్ 18 ఓ పోల్ ను నిర్వహించగా, 70 శాతం మంది ఇండియన్స్, చైనా వస్తువులను వాడకుండా ఉండేందుకు సిద్ధమని స్పష్టం చేయడం గమనార్హం.

ఇక ఇదే సర్వేలో పాల్గొన్న వారిలో 97 శాతం మంది సెలబ్రిటీలు చైనా ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండరాదని సూచించడం గమనార్హం. పాకిస్థాన్ తో పోలిస్తే, భారత్ కు చైనా నుంచే ప్రమాదం అధికంగా ఉండవచ్చని 92 శాతం అభిప్రాయపడ్డారు. 52 శాతం మంది ఇండియా స్వయం సమృద్ధిని సాధించాల్సి వుందని తెలిపారు.

20 మంది భారత జవాన్లు సరిహద్దుల్లో ప్రాణత్యాగం చేసిన తరువాత చైనా వ్యతిరేక సెంటిమెంట్ దేశవ్యాప్తంగా పెరుగుతోందని నెట్ వర్క్ 18 పేర్కొంది. పలు రాష్ట్రాల్లో చైనా వ్యతిరేక నిరసనలు జరుగుతున్నాయని, కేంద్ర మంత్రులు సైతం చైనా ప్రొడక్టులు వద్దని పిలుపునిస్తున్నారని పేర్కొంది. తమ పోల్ సర్వేను వెబ్ సైట్ సోషల్ మీడియా మాధ్యమంగా నిర్వహించామని, సీఎన్ఎన్ న్యూస్ 18, న్యూస్ 18 ఇండియా, న్యూస్ 18 లాంగ్వేజస్, సీఎన్బీసీ - టీవీ 18, మనీ కంట్రోల్, ఫస్ట్ పోస్ట్ తదితర వెబ్ సైట్లలో శుక్రవారం నుంచి 24 గంటల పాటు పోల్ జరిగిందని, మొత్తం 9 ప్రశ్నలు సంధించగా, 6 వేల మందికి పైగా సమాధానాలు ఇచ్చారని సంస్థ పేర్కొంది.

చైనా నమ్మకమైన దేశం కాదని పోల్ లో పాల్గొన్న వారిలో 92 శాతం మంది అభిప్రాయపడ్డారని, ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కంటే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకు మంచి స్నేహితుడని పలువురు పేర్కొన్నారు. తాము ఎటువంటి చైనా ఉత్పత్తులను వాడటం లేదని 43 శాతం మంది పేర్కొనగా, ఆహారం విషయంలో చైనా ఉత్పత్తులకు ఇండియాలో స్థానమే లేదని 31 శాతం మంది వెల్లడించారు.  కాగా, కేంద్ర మంత్రులు రామ్ థాస్ అథావలే, రామ్ విలాస్ పాశ్వాన్ తదితరులు చైనా ఉత్పత్తులను క్రమంగా తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News