Salman Khan: సుశాంత్ మరణం తరువాత వెల్లువెత్తిన విమర్శలపై... తొలిసారిగా నోరువిప్పిన సల్మాన్ ఖాన్!

Salman Break his Scilence over Trolling after sushant Sucide
  • సుశాంత్ అభిమానుల బాధను అర్థం చేసుకోండి
  • తన అభిమానులకు ట్విట్టర్ ద్వారా సల్మాన్ విజ్ఞప్తి
  • తాను కూడా సుశాంత్ ను మిస్ అవుతున్నానని వ్యాఖ్య
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వెనుక, సినీ పరిశ్రమకు చెందిన కొన్ని పెద్ద తలల హస్తం ఉందని, సమయానికి అవకాశాలు రానీయకుండా చేయడంతోనే సుశాంత్ కుంగిపోయి, ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ తదితరులపై పోలీసులకు కూడా కొందరు ఫిర్యాదు చేశారు. సుశాంత్ ఆత్మహత్య తరువాత, కనీసం సంతాపం కూడా తెలపలేదని సల్మాన్ పై ఆరోపణలు వచ్చాయి.

దీంతో సల్మాన్ తొలిసారిగా స్పందించారు. తన ఫ్యాన్స్ ఎవరూ సుశాంత్ ఫ్యాన్స్ ను అపార్థం చేసుకోవద్దని కోరారు. వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సుశాంత్ అభిమానుల నుంచి వస్తున్న విమర్శలను పట్టించుకోవద్దని, ఈ కష్ట సమయంలో వారిని అర్థం చేసుకోవాలని అన్నారు. తాను కూడా సుశాంత్ ను ఎంతో మిస్ అవుతున్నానని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని తన ట్విట్టర్ ఖాతాలో సల్మాన్ వ్యాఖ్యానించారు.

కాగా, సల్మాన్ పై సుశాంత్ అభిమానుల నుంచి, ముఖ్యంగా ఆయన స్వస్థలమైన పాట్నా నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. పాట్నాలో సల్మాన్ సొంత బ్రాండ్ స్టోర్ ను సుశాంత్ అభిమానులు ధ్వంసం చేశారు కూడా. ఇక, తనకు ఎంతో దగ్గరైన ముగ్గురు నటీ నటులు సోనాక్షీ సిన్హా, సకీబ్ సలీమ్, ఆయుష్ శర్మలు ట్విట్టర్ ను వీడిన వేళ, సల్మాన్ అదే ట్విట్టర్ వేదికగా, ఈ కామెంట్లు చేయడం గమనార్హం.
Salman Khan
Sushant Singh Rajput
Twitter
Fans
Trool

More Telugu News