BJP: రాజ్యసభలో మరింత బలం పెంచుకున్న బీజేపీ

BJP members number raised in Rajyasabha compare to Congress
  • పెద్దల సభలో 86కి పెరిగిన బీజేపీ సభ్యుల సంఖ్య
  • 41 మంది సభ్యులకు పరిమితమైన కాంగ్రెస్
  • పట్టు పెంచుకుంటున్న ఎన్డీయే
దేశంలో 19 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. వీటిలో బీజేపీ 8 స్థానాలు కైవసం చేసుకోగా, కాంగ్రెస్, వైసీపీ చెరో 4 స్థానాలు గెలుచుకున్నాయి. మరో మూడింటిని ఇతరులు గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో బీజేపీ బలం మరింత పెరిగింది.

పెద్దల సభలో బీజేపీకి ఇప్పుడు 86 మంది సభ్యులు ఉండగా, కాంగ్రెస్ బలం 41 మాత్రమే. మొత్తమ్మీద 245 సభ్యులతో కూడిన రాజ్యసభలో కూడా దాదాపు 100 సీట్లతో ఎన్డీయే ఆధిపత్యం స్పష్టమవుతోంది. ఏఐఏడీఎంకే (9), బీజేడీ (9), వైసీపీ (6)లతో పాటు పలు ఇతర ప్రాంతీయ పార్టీలు, నామినేటెడ్ సభ్యులు కూడా మద్దతు పలికితే, బిల్లుల సమయంలో మోదీ సర్కారుకు రాజ్యసభలోనూ సంఖ్యాపరంగా ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకపోవచ్చు.
BJP
Congress
Rajya Sabha
Members
Polls

More Telugu News