Pawan Kalyan: సేవా రుసుములపై బతికేవారిని సర్కారు ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థం కావట్లేదు: పవన్ కల్యాణ్

 JanaSena Chief PawanKalyan demand to ap govt
  • ఎస్సీ కార్పొరేషన్‌ ఫెసిలిటేటర్లను ఆదుకోవాలి 
  • ఫెసిలిటేటర్లపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూడడం సరికాదు
  • ఈ చిరుద్యోగులపై సానుకూలంగా స్పందించాలి
  • బకాయిలు ఇచ్చి, తగిన ఉపాధి చూపాలి
ఎస్సీ కార్పొరేషన్‌ ఫెసిలిటేటర్లను ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. లక్ష ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం స్వల్ప వేతనాలు, సేవా రుసుముల మీద బతికేవారిని ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థం కావట్లేదని ఆయన అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ తరఫున క్షేత్ర స్థాయిలో పని చేసేందుకు నియమితులయిన ఫెసిలిటేటర్లపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూడడం సరికాదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ చిరుద్యోగులపై సానుకూలంగా స్పందించి బకాయిలు ఇచ్చి, తగిన ఉపాధి చూపాలని కోరుతున్నట్లు పవన్ చెప్పారు.  

              
Pawan Kalyan
Janasena
Andhra Pradesh

More Telugu News