Software: తిరుమలలో భౌతికదూరం అమలుకు కొత్త సాఫ్ట్ వేర్

  • పునఃప్రారంభమైన శ్రీవారి దర్శనాలు
  • కొండపైకి వస్తున్న భక్తులకు భౌతికదూరం సూచనలు
  • సాఫ్ట్ వేర్ తో నియంత్రించాలని భావిస్తున్న టీటీడీ
  • ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న సాఫ్ట్ వేర్
New software to control physical distance in between devotees in Tirumala

సుదీర్ఘ లాక్ డౌన్ తర్వాత ఇటీవలే తిరుమల పుణ్యక్షేత్రం మళ్లీ భక్తులతో కళకళలాడుతోంది. శ్రీవారి దర్శనాలు పునఃప్రారంభం కావడంతో కొండపైకి భక్తుల రాక ఎక్కువైంది. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో వెంకన్న క్షేత్రంలో భక్తుల నడుమ భౌతికదూరం నిబంధన అమలు ఎంతో కష్టసాధ్యంగా కనిపిస్తోంది.

దీనిని అధిగమించడానికి ఓ సాఫ్ట్ వేర్ రూపొందిస్తున్నారు. తిరుమల వ్యాప్తంగా ఉన్న కెమెరాలతో భక్తుల కదలికలను అనునిత్యం పర్యవేక్షిస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సీసీ కెమెరాల ద్వారా భక్తులు పరస్పరం ఎంతదూరంలో ఉన్నారన్నది కంప్యూటర్ లో నిక్షిప్తం చేసిన ఈ కొత్త సాఫ్ట్ వేర్ గుర్తిస్తుంది.

ప్రోటోకాల్ ప్రకారం నిర్దిష్టదూరంలో ఉంటే మానిటరింగ్ స్క్రీన్ పై సదరు వ్యక్తులను పచ్చ రంగు మార్కుతో, నిబంధనలు ఉల్లంఘించి మరీ దగ్గరగా ఉన్న వ్యక్తులను ఎరుపు రంగు మార్కుతో సూచిస్తారు. తద్వారా వారికి అప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తారు. ఇదంతా కంప్యూటరైజ్డ్ వ్యవస్థ ద్వారా చేపడతారు. ప్రస్తుతం ఈ సాఫ్ట్ వేర్ అభివృద్ధి దశలో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నారు.


More Telugu News