Shruti Hassan: పవన్ సినిమాని వదులుకున్న శ్రుతి?

Shruti Hassan rejects Pawan Kalyans movie
  • పవన్ తాజా చిత్రం 'వకీల్ సాబ్'
  • మొదట్లో ఒప్పుకున్న శ్రుతి హాసన్
  • చిన్న పాత్ర కావడంతో తప్పుకున్న వైనం
పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం వస్తే ఏ కథానాయికా వదులుకోదు. ఎందుకంటే, ఆ సినిమా తమ కెరీర్ కి అంతో ఇంతో హెల్ప్ అవుతుందని భావిస్తారు. అందులోనూ కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్లీ టాలీవుడ్ కి వస్తున్న హీరోయిన్ కైతే మరీనూ. అందుకే ఎవరైనా సరే వెంటనే ఒప్పేసుకుంటారు. అయితే, శ్రుతి హాసన్ మాత్రం తాజాగా పవన్ కల్యాణ్ చిత్రాన్ని తిరస్కరించినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం వేణు శ్రీరాం దర్శకత్వంలో పవన్ 'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తున్నారు. హిందీలో హిట్టయిన 'పింక్' చిత్రానికి ఇది రీమేక్. ఇందులో కథానాయిక పాత్రకు శ్రుతి హాసన్ ని ఎంచుకున్నట్టు వార్తలొచ్చాయి. కొంత కాలం గ్యాప్ తర్వాత మళ్లీ టాలీవుడ్ కి వచ్చిన శ్రుతి ఈ ఆఫర్ ని మొదట్లో ఒప్పుకుని, ఇప్పుడు చేయనని చెప్పినట్టు సమాచారం. కారణం ఏమిటంటే, ఈ సినిమాలో కథానాయిక పాత్ర నిడివి చిన్నదట.. పైగా ఏమాత్రం ప్రాధాన్యత లేదట. ఇలాటి పాత్ర చేయడం వల్ల తన కెరీర్ కి ఏమాత్రం ప్రయోజనం ఉండదని అమ్మడు ఆలోచించుకుని, ఇప్పుడు నో చెప్పిందట!    
Shruti Hassan
Pawan Kalyan
Vakeel Saab
Pink

More Telugu News