Raja Singh: కరోనా టెస్ట్ చేయించుకున్నా: రాజాసింగ్

Corona Test for Rajasingh
  • నా గన్ మెన్ కు వైరస్ సోకింది
  • నేను, నా కుటుంబీకులు టెస్ట్ చేయించుకున్నాం
  • అందరూ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి
  • ట్విట్టర్ లో రాజాసింగ్
తన గన్ మెన్ కు శుక్రవారం నాడు కరోనా సోకినట్టు తేలిందని, దీంతో తాను కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నానని బీజేపీ నేత రాజా సింగ్ వెల్లడించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "నిన్న నా గన్ మెన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. నేను, నా కుటుంబీకులు, సన్నిహిత కార్యకర్తలు టెస్ట్ చేయించుకున్నాము. రెండు రోజుల్లో రిపోర్టులు రావచ్చు. శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ యోగా చేయాలని, ఆయుష్ మంత్రాలయ గైడ్ లైన్స్ పాటించాలని కోరుతున్నా" అని ఆయన ట్వీట్ చేశారు. తాను వ్యాయామం చేస్తున్న ఓ వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు.
Raja Singh
Corona Virus
Test
gunman

More Telugu News