హైదరాబాద్ పరిధిలో కట్టలు తెంచుకుంటున్న కరోనా... 329 కొత్త కేసులు

Hyderabad and Telangana sees more corona cases
  • జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో కరోనా విలయం
  • రాష్ట్రంలో తాజాగా 499 మందికి కరోనా పాజిటివ్
  • తాజాగా 51 మంది డిశ్చార్జి
జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా తీవ్రత మరింత పెరిగింది. తాజాగా 329 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పొరుగునే ఉన్న రంగారెడ్డి జిల్లాలోనూ 129 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 499 కేసులు నమోదు కాగా, మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,526కి పెరిగింది. ఇవాళ 51 మంది డిశ్చార్జి అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3,352గా నమోదైంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో మూడు మరణాలు సంభవించగా, కరోనా మృతుల సంఖ్య 198కి చేరింది. ప్రస్తుతం 2,976 మంది చికిత్స పొందుతున్నారు.
.
Go Back to Shorts
Hyderabad
Corona Virus
Positive
Death
Telangana
COVID-19

More Telugu News