Mirage-2000: చైనా సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ విమానాలను మోహరిస్తున్న భారత్

India deploys Mirage fighter jets near Ladakh
  • ఇటీవలే లడఖ్ వద్ద చైనా బలగాలతో ఘర్షణ
  • చైనాపై ప్రతీకార చర్యలకు అన్నివైపుల నుంచి డిమాండ్లు
  • చైనా సరిహద్దు ప్రాంతాలకు మిరాజ్-2000 విమానాలు
చైనాతో సుదీర్ఘకాలంగా భారత్ కు సరిహద్దు సమస్యలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలు యావత్ భారతాన్ని తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేశాయి. చైనాకు గట్టిగా బుద్ధి చెప్పాల్సిందేనన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, సరిహద్దు ప్రాంతాల్లో భారత వాయుసేన అప్రమత్తమైంది. చైనాతో సరిహద్దుల వద్ద మిరాజ్-2000 యుద్ధ విమానాలను మోహరించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. పరిస్థితులను సమీక్షించేందుకు ఎయిర్ చీఫ్ మార్షల్ బదౌరియా లేహ్ లో పర్యటించారు. భారత వాయుసేన ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామన్న సంకేతాలను  పంపుతోంది. లడఖ్ ఎయిర్ బేస్ లోనూ భారత యుద్ధ విమానాల కదలికలు ఊపందుకున్నాయి.
Mirage-2000
India
China
Border
IAF

More Telugu News