Vijayasai Reddy: పదవి దక్కుతుందనుకుంటే కనకమేడల వంటి మీవాళ్లను దింపుతారు, ఓటమి తప్పదంటే బలహీన వర్గాల వారిని బలిచేస్తారా?: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy responds on Varla Ramaiah defeat in Rajyasabha elections
  • ఏపీలో ముగిసిన రాజ్యసభ ఎన్నికలు
  • వైసీపీ అభ్యర్థుల విజయం
  • ఓటమిపాలైన టీడీపీ నేత వర్ల రామయ్య
  • దళితులను అవమానిస్తున్నారంటూ విజయసాయి వ్యాఖ్యలు
ఏపీలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అన్ని స్థానాలనూ వైసీపీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగ్గా, మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, నత్వానీ గెలిచారు. టీడీపీ తరఫున బరిలో దిగిన ఏకైక అభ్యర్థి వర్ల రామయ్య ఓటమిపాలయ్యారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు.

పదవి దక్కుతుంది అనుకుంటే కనకమేడల వంటి మీ వాళ్లను బరిలో దింపుతారు, ఓటమి తప్పదంటే బలహీన వర్గాలను బలిచేస్తారా? అంటూ ప్రశ్నించారు. ఇలా పనిగట్టుకుని దళితులను ఎందుకు అవమానిస్తారు? అంటూ నిలదీశారు. గతంలో పుష్పరాజ్, నర్సింహులు గార్లను ఇలాగే అవహేళన చేశారని విజయసాయి పేర్కొన్నారు. గెలిచే అవకాశం లేదని తెలిసి కూడా వర్ల రామయ్యను బరిలో దింపారని విమర్శించారు.
Vijayasai Reddy
Varla Ramaiah
Rajya Sabha
Elections
Chandrababu

More Telugu News