Micromax: ప్రీమియం ఫీచర్లతో రూ. 10 వేల కన్నా తక్కువ ధరలో మూడు మైక్రోమ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు!

Micormax New Smart Phones below 10K With Premium Fetures
  • అతి త్వరలో మార్కెట్లోకి
  • చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదిగే ఆలోచన
  • ట్విట్టర్ లో వెల్లడించిన మైక్రోమ్యాక్స్
స్మార్ట్ ఫోన్ మార్కెటింగ్ సంస్థ మైక్రోమ్యాక్స్, భారత మార్కెట్లో మూడు కొత్త ఫోన్లను విడుదల చేసింది. కొత్త ఫోన్లలో ప్రీమియం ఫీచర్లతో కూడిన బడ్జెట్ ఫోన్ కూడా ఉందని సంస్థ తన అధికారిక సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపింది. ఓ అంశంపై గత కొంతకాలంగా తాము కృషి చేస్తున్నామని, త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్నామని, తమను అనుసరించాలని ట్విట్టర్ లో మైక్రోమ్యాక్స్ వెల్లడించింది.

కాగా, గత సంవత్సరం అక్టోబర్ లో ఐవన్ నోట్ ను విడుదల చేసిన తరువాత మైక్రోమ్యాక్స్ మరో కొత్త మొబైల్ ను మార్కెట్లోకి విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఒకేసారి మూడు స్మార్ట్ ఫోన్లను రంగంలోకి దింపనుంది. ఈ ఫోన్ల ధరలన్నీ రూ. 10 వేల లోపే ఉంటాయని, ట్విట్టర్ లో సంస్థ ప్రకటన చూసిన తరువాత, వినియోగదారులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సంస్థ పేర్కొంది.

ఇదే సమయంలో చైనా ఫోన్లకు ప్రత్యామ్నాయంగా సరికొత్త స్మార్ట్ ఫోన్లను తయారు చేయాలని పలువురు సంస్థకు సూచించగా, తాము ఆ పనిలోనే ఉన్నామంటూ సానుకూల సమాధానం ఇచ్చింది.
Micromax
New Phones
Twitter
Smart Phones

More Telugu News