భారత్‌లో ఒక్కరోజులో 13,586 మందికి సోకిన కరోనా

India reports the highest single day spike of 13586 new COVID19 cases
  • కరోనా కేసుల సంఖ్య మొత్తం 3,80,532
  • మృతుల సంఖ్య 12,573
  • 1,63,248 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
  • కోలుకున్న 2,04,711 మంది
భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 13,586 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పటి వరకు ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. అదే సమయంలో 336 మంది మరణించారు.
     
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 3,80,532కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 12,573 కి పెరిగింది. 1,63,248 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,04,711 మంది కోలుకున్నారు.
Go Back to Shorts
India
COVID-19
Corona Virus

More Telugu News