చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. మలయాళ దర్శకుడు సాచీ కన్నుమూత

Malayalam director Sachy dies in Thrissur
  • ఇటీవల తుంటి మార్పిడి శస్త్రచికిత్స
  • 16న గుండెపోటు రావడంతో ఆసుపత్రికి
  • చికిత్సకు స్పందించని శరీరం
మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు సాచీ కన్నుమూశారు. ఇటీవల తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న సాచీ.. త్రిస్సూర్‌లోని జూబ్లీ మిషన్ ఆసుపత్రిలో నిన్న తుదిశ్వాస విడిచారు. ఆపరేషన్ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. దీనికి తోడు ఈ నెల 16న గుండెపోటు రావడంతో వెంటనే ఆయనను జూబ్లి మిషన్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే, చికిత్సకు ఆయన శరీరం స్పందించలేదని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి కన్నుమూశారు. 2015లో దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన సాచీ పూర్తిపేరు కేఆర్ సచ్చిదానందన్. పృథ్వీ సుకుమారన్ హీరోగా నటించిన ‘అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్’ చిత్రానికి చివరిసారి పనిచేశారు. ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది.

Go Back to Shorts
Malayalam
director
Sachy
Thrissur

More Telugu News