Muslims: ముస్లింలపైనే ఎక్కువ కేసులు ఎందుకు నమోదు చేశారు?: పోలీసులకు తెలంగాణ హైకోర్టు ప్రశ్న

  • ముస్లింలపై వివక్ష చూపించారంటూ పిల్
  • ఇతరులు ఉల్లంఘనలకు పాల్పడలేదా? అని ప్రశ్నించిన హైకోర్టు
  • అమెరికాలో ఏం జరుగుతోందో చూడాలని వ్యాఖ్య
TS High Court questions police on more lockdown on Muslims

లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన కేసులను ఎక్కువగా ముస్లింలపైనే ఎందుకు నమోదు చేశారంటూ హైదరాబాద్ పోలీసు అధికారులను తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. దీని అర్థం ఇతర సామాజికవర్గాలకు చెందిన వారు ఉల్లంఘనలకు పాల్పడలేదనా? అని నిలదీసింది. లాక్ డౌన్ సమయంలో పోలీసులు వివక్ష చూపించారంటూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం ఈరోజు విచారించింది.

విచారణ సందర్భంగా జడ్జిలు అమెరికాలో చోటు చేసుకున్న ఘటనను ఉదహరించారు. 'అమెరికాలో ఏం జరుగుతోందో చూడండి. నల్లజాతీయుడిని పోలీసులు చంపడంతో... దేశం మొత్తం రావణకాష్ఠంలా రగులుతోంది' అని అన్నారు. మైనార్టీల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు.

More Telugu News