SEC: నిమ్మగడ్డ రమేశ్ కేసులో స్టే కోరుతూ ఏపీ ఎన్నికల సంఘం పిటిషన్.. నిరాకరించిన సుప్రీంకోర్టు!

  • హైకోర్టు తీర్పును సవాల్ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
  • ఈ అంశాన్ని ఇప్పటికే విచారించామన్న సుప్రీంకోర్టు
  • పాత పిటిషన్లతో కలిపి విచారిస్తామని వ్యాఖ్య
Supreme Court rejects to give stay in SEC Ramesh Kumar case

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. ఎస్ఈసీగా రమేశ్ కుమార్ ను కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి వేసిన పిటిషన్ ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది.

హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. ఇదే అంశంపై ఇప్పటికే విచారించామని, నోటీసులు కూడా ఇచ్చామని తెలిపింది. ఈ పిటిషన్ పై కూడా నోటీసులు ఇస్తామని... రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ తో కలిపి దీనిని విచారిస్తామని చెప్పింది. గతంలో దాఖలైన పిటిషన్లకు కొత్త పిటిషన్ ను జత చేసింది. వచ్చే వారం వీటన్నింటిపై విచారణ జరిగే అవకాశం ఉంది.

More Telugu News