Ramyakrishna: బాలీవుడ్ కు దూరం కావడానికి కారణం ఇదే: రమ్యకృష్ణ

Ramyakrishna reveals why she is away from Bollywood
  • బాలీవుడ్ లో నేను నటించిన సినిమాలు హిట్ కాలేదు
  • దాంతో నాకు అవకాశాలు రాలేదు
  • దక్షిణాదిలో మాత్రం సక్సెస్ అయ్యాను
దక్షిణాది సినీ పరిశ్రమలో రమ్యకృష్ణది ఒక ప్రత్యేకమైన స్థానం. అగ్ర హీరోలందరితో నటించిన ఆమె... అన్ని రకాల పాత్రలను పోషించి మెప్పించారు. హీరోలతో సమానమైన స్టార్ డమ్ ను ఆమె సంపాదించారంటే అతిశయోక్తి కాదు. హీరోయిన్ గా విజయవంతమైన కెరీర్ ను సొంతం చేసుకున్న ఆమె... ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదరగొడుతోంది. క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులకు మరింత చేరువవుతోంది.

అందం, అభినయం కలగలిసిన రమ్యకృష్ణ... హీరోయిన్ గా బాలీవుడ్ లో మాత్రం విజయవంతం కాలేకపోయింది. కానీ, ఇప్పుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ఫైటర్' ద్వారా రమ్య మరోసారి బాలీవుడ్ లోకి ఎంట్రీ  ఇవ్వబోతోంది.

ఈ సందర్భంగా ఓ ఆంగ్ల మీడియాతో రమ్యకృష్ణ మాట్లాడుతూ బాలీవుడ్ లో ఎందుకు సక్సెస్ కాలేకపోయిందో వివరించింది. బాలీవుడ్ లో తాను నటించిన చిత్రాలు విజయవంతం కాలేకపోయాయని చెప్పింది. సినిమాలు ఫ్లాప్ కావడంతో తనకు అవకాశాలు రాలేదని  తెలిపింది. ఈ కారణం వల్లే బాలీవుడ్ కు దూరమయ్యానని... దక్షిణాదిలో మాత్రం సక్సెస్ అయ్యానని చెప్పింది.
Ramyakrishna
Tollywood
Bollywood

More Telugu News