నేటి సాయంత్రం 6 గంటలకు గవర్నర్‌తో చంద్రబాబు భేటీ

18-06-2020 Thu 07:49
  • రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను వివరించనున్న చంద్రబాబు
  • టీడీపీ నేతలపై దాడులు, అరెస్టులను ప్రస్తావించనున్న వైనం
  • వైసీపీ నేతల అవినీతిపైనా ఫిర్యాదు చేయనున్న బాబు
TDP Chief Chandrababu to meet AP Governor

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేటి సాయంత్రం ఆరు గంటలకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పలు విషయాలను ఆయనతో చర్చించనున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలపై దాడులు, అరెస్టులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.

అలాగే, రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని, రాజ్యాంగ వ్యవస్థలను ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తోందని ఫిర్యాదు చేయనున్నారు. నాలుగు రోజుల్లో ముగ్గురు బీసీ మంత్రులపై తప్పుడు కేసులు బనాయించిన విషయంతోపాటు వైసీపీ నేతల అవినీతి కుంభకోణాలపైనా గవర్నర్‌కు చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం.