colonel santoshbabu: సైనిక లాంఛనాల మధ్య నేడు కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు

colonel santoshbabu last rites held today
  • సూర్యాపేటకు ఆలస్యంగా పార్థివదేహం
  • నిన్న నిర్వహించాల్సిన అంత్యక్రియలు నేటికి వాయిదా
  • 50 మందిని మాత్రమే అనుమతిస్తామన్న కలెక్టర్
లడఖ్‌లోని గాల్వన్ లోయలో వీరమరణం పొందిన సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు నేడు సైనిక లాంఛనాల మధ్య జరగనున్నాయి. నిజానికి నిన్ననే ఆయన అంత్యక్రియలు జరగాల్సి ఉండగా, పార్థివదేహం ఆలస్యంగా సూర్యాపేటకు చేరుకోవడంతో అంత్యక్రియలు నేడు నిర్వహించాలని నిర్ణయించారు. కేసారంలో సంతోష్‌బాబు కుటుంబానికి ఉన్న వ్యవసాయ క్షేత్రంలో నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ టి. వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు.

ప్రజల సందర్శనార్థం సంతోష్ పార్థివదేహాన్ని ఈ ఉదయం 8 గంటల వరకు ఉంచనున్నట్టు పేర్కొన్నారు. పార్థివ దేహాన్ని సందర్శించే క్రమంలో ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. నిబంధనల ప్రకారం అంత్యక్రియలకు 50 మందిని మాత్రమే అనుమతించనున్నట్టు పేర్కొన్నారు.
colonel santoshbabu
suryapet
last rites
china
India

More Telugu News