Keerthi Suresh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం   

Keerthi Suresh not ready for shoots now
  • షూటింగ్ అంటే భయపడుతున్న నాయిక 
  • ఫాలోవర్స్ కి థ్యాంక్స్ చెప్పిన నాగార్జున
  • కమల్ సీక్వెల్ కి స్క్రిప్టు సిద్ధం
*  షూటింగులు చేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతిని ఇచ్చినప్పటికీ, ప్రారంభించడానికి చాలామంది ఇంకా తటపటాయిస్తూనే వున్నారు. అదే కోవలో కథానాయిక కీర్తి సురేశ్ కూడా 'అమ్మో .. షూటింగా?' అంటూ భయపడుతోంది. 'ప్రస్తుత పరిస్థితులలో షూటింగ్ చేయడం శ్రేయస్కరం కాదు. అందుకే నేను ఇప్పట్లో షూటింగులో జాయిన్ కాలేను, ఈ కరోనా మహమ్మారి ఓ కొలిక్కి రావాలి.. అంతవరకూ నేను సెట్స్ కి వెళ్లేది లేదు" అంటోంది కీర్తి.
*  అక్కినేని నాగార్జునకు ఇప్పటికీ అభిమానులు చెక్కుచెదరలేదని సోషల్ మీడియా మరోసారి నిరూపించింది. తాజాగా ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో 60 లక్షల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
*  గతంలో కమలహాసన్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన 'వెట్టియాడు విలైయాడు' (తెలుగులో రాఘవన్) చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ చేసే ప్రయత్నంలో భాగంగా గౌతమ్ మీనన్ స్క్రిప్టును సిద్ధం చేశాడట. కమల్ ఓకే చెబితే, ఇక సెట్స్ కి వెళుతుంది.
Keerthi Suresh
Nagarjuna
Kamala Hassan
Goutham Menon

More Telugu News