Dr Madhu Thottappilil: లడఖ్ ఘర్షణలపై వెటకారంగా ట్వీట్ చేసిన టీమ్ డాక్టర్.. సస్పెండ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్

CSK suspends team doctor after objectionable tweet on Jawans
  • లడఖ్ లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ
  • వీరమరణం పొందిన భారత జవాన్లు
  • "శవపేటికలపై పీఎం కేర్స్ స్టిక్కర్లు వేస్తారా?" అంటూ టీమ్ డాక్టర్ ట్వీట్
లడఖ్ లో జరిగిన ఘర్షణల్లో భారత జవాన్లు వీరమరణం పొందడం పట్ల యావత్ భారతదేశం తీవ్రంగా బాధపడుతోంది. ఈ దశలో ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ కు చెందిన టీమ్ డాక్టర్ మధు తొట్టాప్పిలిల్ చేసిన ట్వీట్ ఆగ్రహజ్వాలలు రేకెత్తించింది.

"ఈ విషయంలో ఆసక్తిగా ఉంది... లడఖ్ నుంచి వచ్చే జవాన్ల శవపేటికలపైనా 'పీఎం కేర్స్' స్టిక్టర్ లు వేస్తారేమో..!"  అంటూ డాక్టర్ మధు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను తీవ్రంగా పరిగణించిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ వెంటనే అతడ్ని సస్పెండ్ చేసింది. టీమ్ డాక్టర్ గా అతడ్ని తొలగిస్తున్నట్టు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించింది. డాక్టర్ మధు ట్వీట్ పట్ల చెన్నై సూపర్ కింగ్స్ చింతిస్తోందని, ఆ ట్వీట్ తో అతడి దృక్పథం తేటతెల్లమైందని పేర్కొంది. కాగా, ఐపీఎల్ ప్రారంభం నుంచి డాక్టర్ మధు తొట్టాప్పిలిల్ చెన్నై జట్టుకు సేవలు అందిస్తున్నారు.
Dr Madhu Thottappilil
CSK
Tweet
Jawans
Ladakh
IPL

More Telugu News