Atishi: ఢిల్లీలో కరోనా బీభత్సం... ఆప్ జాతీయ అధికార ప్రతినిధికి పాజిటివ్

AAP National Spokes Person Atishi tested corona positive
  • కరోనా బారినపడిన ఆప్ మహిళా ఎమ్మెల్యే ఆతిషి
  • పెద్దగా లక్షణాలు లేకపోవడంతో హోమ్ క్వారంటైన్
  • త్వరగా కోలుకోవాలన్న సీఎం కేజ్రీవాల్
దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల నిత్యం వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా ఉద్ధృతి తగ్గడంలేదు. కేంద్రం కూడా ఢిల్లీ పరిస్థితి పట్ల సానుకూలంగా స్పందించి చేయూతనిచ్చేందుకు సంసిద్ధురాలైంది. ఈ నేపథ్యంలో, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా ఎమ్మెల్యే, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఆతిషి కరోనా బారినపడ్డారు. అస్వస్థతకు గురికావడంతో వైద్యపరీక్షలు చేయించుకున్న ఆతిషీకి కరోనా నిర్ధారణ అయింది.

దీనిపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ కరోనాపై వ్యతిరేక పోరాటంలో ఆతిషి ఎంతో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. త్వరలోనే కోలుకుని మళ్లీ ప్రజాసేవలో పాలుపంచుకుంటారని ఆశిస్తున్నామని ట్వీట్ చేశారు. కాగా, ఆతిషిలో కరోనా లక్షణాలు తక్కువ స్థాయిలో ఉండడంతో ఆమె ప్రస్తుతం తన నివాసంలోనే క్వారంటైన్ లో ఉన్నారు.
Atishi
Corona Virus
Positive
National Spokes Person
MLA
AAP
Delhi
Arvind Kejriwal

More Telugu News