Keerthi Suresh: 'సర్కారు వారి పాట'కు హీరోయిన్ ఖరారు!

Keerthi Suresh finalized for Mahesh movie
షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో రూపొందే 'సర్కారు వారి పాట' చిత్రంలోని కథానాయిక ఎంపిక  కోసం గత కొన్నాళ్లుగా జరుగుతున్న కసరత్తు ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చింది. ఇందులో కథానాయికగా బాలీవుడ్ భామను ఎంపిక చేద్దామని ఆ దిశగా మొదట్లో ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో కైరా అద్వానీ, సయీ మంజ్రేకర్ వంటి భామలను సంప్రదించారు. అయితే, వీరెవ్వరూ కూడా ఈ చిత్రంలో నటించడానికి ముందుకురాలేదు. వీరడిగిన డేట్స్ వారి దగ్గర లేకపోవడమే కారణం.

దీంతో ఇక దక్షిణాది అమ్మాయినే ఖరారు చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకుని ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో వీరి మొదటి ఛాయిస్ అయిన కీర్తి సురేశ్ ఇందులో నటించడానికి ఓకే చెప్పినట్టు తాజా సమాచారం. మహేశ్ కూడా కీర్తికే మొగ్గు చూపడంతో ఆమె ఎంపిక సులువయింది. వీరు కోరిన సమయాలలో కావలసిన డేట్స్ ను కూడా ఈ ముద్దుగుమ్మ కేటాయించినట్టు చెబుతున్నారు. దీంతో త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగును మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Keerthi Suresh
Mahesh Babu
Parashuram
Kaira Advani

More Telugu News