Varla Ramaiah: అలాంటి నిర్భయ చట్టాన్ని అయ్యన్నపాత్రుడిపై ఉపయోగిస్తారా?: వర్ల రామయ్య

How do you apply Nirbhaya act on Ayyanna Patrudu asks Varla Ramaiah
  • మానభంగం చేసి చంపిన నేరస్తులపై నిర్భయ చట్టాన్ని ప్రయోగిస్తారు
  • రోజూ మిమ్మల్ని విమర్శించే అయ్యన్నపై ఆ చట్టాన్ని ఉపయోగిస్తారా?
  • ఇది కక్ష సాధింపు కాదా?
టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పై వర్ల రామయ్య మండిపడ్డారు. ముఖ్యమంత్రిగారూ మీ పాలనలో నిర్భయ చట్టం రూపు మార్చుకుందని విమర్శించారు. ఆనాడు ఢిల్లీలో బస్సులో ఒక మహిళను హింసించి, మానభంగం చేసి చంపిన కరడుగట్టిన నేరస్తులను శిక్షించడానికి 'నిర్భయ' చట్టం ఏర్పాటయిందని చెప్పారు. అలాంటి చట్టాన్ని అనునిత్యం మీ పాలనను ఎండగట్టే అయ్యన్నపాత్రుడిపై ఉపయోగిస్తారా? అని మండిపడ్డారు. ఇది కక్ష సాధింపేకదా? అని ఎద్దేవా చేశారు.
Varla Ramaiah
Ayyanna Patrudu
Nirbhaya Act
9 PM Telugu News
Jagan
YSRCP

More Telugu News