Budda Venkanna: టీడీపీ నేతలు ఢిల్లీ లాయర్ల ఇళ్ల ముందు క్యూలు కడుతున్నారన్న విజయసాయి... దీటుగా బదులిచ్చిన బుద్ధా

Buddha Venkanna replies to Vijayasai Reddy comments
  • రాష్ట్రంలో టీడీపీ నేతల అరెస్టులు
  • అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం
  • టీడీపీ నేతలు లాయర్లను ప్రాధేయపడుతున్నారన్న విజయసాయి
  • మీరు జడ్జిలను కొనాలనుకుని అడ్డంగా బుక్కయ్యారన్న బుద్ధా
ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న వరుస అరెస్టుల నేపథ్యంలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అదేస్థాయిలో బదులిచ్చారు.

గంటకు రూ.5 లక్షల ఫీజు తీసుకునే ఢిల్లీ లాయర్ల ముందు టీడీపీ నేతలు క్యూలు కడుతున్నారని విజయసాయి ట్విట్టర్ లో ఆరోపించారు. అధినేత తమను కాపాడలేడని భావించి ఎవరికి వారు లాయర్లకు అడ్వాన్సులు ఇచ్చి గండం నుంచి గట్టెక్కించమని ప్రాధేయపడుతున్నారని ఎద్దేవా చేశారు. బాబు బీజేపీలోకి పంపిన కోవర్టులు కూడా తమ బాస్ కోసం అదే పనిలో ఉన్నారని విజయసాయి పేర్కొన్నారు.

విజయసాయి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బుద్ధా... రూ.43 వేల కోట్ల దోపిడీ కేసులో ఏ1, ఏ2ల బెయిల్ కోసం నువ్వూ, గనుల కేసులో గాలి అన్నయ్య జడ్జిలనే కొనాలనుకుని అడ్డంగా బుక్కయ్కారంటూ ఎద్దేవా చేశారు. ఈ విషయం అప్పుడే మర్చిపోయారా విజయసాయిరెడ్డీ? అంటూ ఎత్తిపొడిచారు. తాజాగా ఓ లాయర్ కి రూ.5 కోట్లు ఇచ్చారని, ఎంత పెద్ద లాయర్ కి అడ్వాన్స్ ఇచ్చినా పాపం శుక్రవారం నుంచి ఉపశమనం దక్కడంలేదని సెటైర్ వేశారు. 
Budda Venkanna
Vijay Sai Reddy
Arrests
Telugudesam
Laywers
Delhi

More Telugu News