Chandrababu: అచ్చెన్న పరిస్థితిపై జీజీహెచ్ సూపరింటిండెంట్ కు చంద్రబాబు ఫోన్!

Chandrababu talks to GGH doctors on Atchannaidu health condition
  • అచ్చెన్నకు మరోసారి పైల్స్ ఆపరేషన్
  • గాయం తిరగబెట్టిందన్న సూపరింటిండెంట్
  • అత్యుత్తమ వైద్యం అందించాలని డాక్టర్లను కోరిన చంద్రబాబు
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడుకు  మరోసారి పైల్స్ ఆపరేషన్ నిర్వహించడం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గుంటూరు జీజీహెచ్ సూపరింటిండెంట్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.  
 
 అచ్చెన్న ఇదివరకే పైల్స్ ఆపరేషన్ చేయించుకున్నా, కొన్నిరోజుల నుంచి గాయం నుంచి రక్తస్రావం ఆగడంలేదని చంద్రబాబుకు ఆయన వివరించారు. అందుకే మరోసారి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. అచ్చెన్నకు అత్యుత్తుమ వైద్యం అందించాలని చంద్రబాబు జీజీహెచ్ డాక్టర్లను కోరారు. అటు, అచ్చెన్నాయుడు అర్ధాంగికి కూడా చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Chandrababu
Atchannaidu
Surgery
GGH
Guntur

More Telugu News